హైదరాబాద్ వరద బాధితుల సహాయార్థం స్పందించిన హీరో నాగార్జున

వరుసగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ తేరుకోవడంలేదు. వర్షాలు, వరదలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వారిని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆదుకోవడానికి ముందుకొస్తున్నాయి. సోమవారం తమిళనాడు ప్రభుత్వం రూ. 10 కోట్లు ప్రకటిస్తే.. మంగళవారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రూ. 15 కోట్లు ఆర్థికసాయంగా ప్రకటించారు. సినీ హీరో అక్కినేని నాగార్జున కూడా నగర వాసుల కష్టాలు చూసి స్పందించారు. తెలంగాణ ప్రభుత్వానికి తన వంతు సాయంగా రూ. 50 లక్షలు ప్రకటిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

‘భారీ వర్షాలు మరియు వరదలు హైదరాబాద్ ప్రజల జీవితాలను నాశనం చేశాయి. తక్షణ ఉపశమనం కోసం తెలంగాణ ప్రభుత్వం 550 కోట్లు విడుదల చేయడాన్నిఅభినందిస్తున్నాము. ప్రజలను ఆదుకోవడం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి ధన్యవాదాలు. హైదరాబాద్ ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో నావంతు సాయంగా తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ. 50 లక్షలు అందిస్తున్నాను’ అని హీరో నాగార్జున ట్వీట్ చేశారు.

For More News..

ఎమర్జేన్సీ అలర్ట్: మరో మూడు, నాలుగు గంటలు భారీ వర్షం

హైదరాబాద్‌కు ఢిల్లీ ప్రభుత్వం రూ. 15 కోట్ల ఆర్థికసాయం

కరోనాతో సోషల్ మీడియా స్టార్ మృతి.. బెడ్ మీద నుంచి అభిమానులకు చివరి సందేశం

Latest Updates