నాని, విక్రమ్ కుమార్ ల సినిమా ప్రారంభం

విక్రమ్ కె,కుమార్ డైరెక్షన్ లో నాని హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీని ఇవాళ లాంచనంగా ప్రారంభించారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కొరటాల శివ పాల్గొన్నారు. రేపటి నుంచి రెగ్యులర్‌ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాను.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌ పై నవీన్‌ యెర్నేని, రవి శంకర్‌, మోహన్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అనౌన్స్ చేస్తామని తెలిపింది యూనిట్. నాని ప్రస్తుతం ‘జెర్సీ’ సినిమాతో బిజీగా ఉన్నారు. గౌతమ్‌ తిన్ననూరి సినిమాకు డైరెక్టర్. 1990కి చెందిన ఓ క్రికెటర్‌ జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్‌ లో జెర్సీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

Latest Updates