ఒక్క సినిమా.. మూడు టైటిల్స్

సినిమాకి స్టోరీ ఎంత ముఖ్యమో, టైటిల్ కూడా అంతే ముఖ్యం. అందుకే టైటిల్ పెట్టడానికి పెద్ద కసరత్తే చేస్తారు ఫిల్మ్ మేకర్స్. అందులోనూ ఎన్టీయార్ మూవీ టైటిల్ అంటే అభిమానులు ఏ రేంజ్‌‌లో ఊహించుకుంటారో చెప్పక్కర్లేదు. అందుకే ప్రశాంత్ నీల్‌‌ డైరెక్షన్‌‌లో ఎన్టీయార్ నటించే మూవీ టైటిల్‌‌గురించి అప్పుడే డిస్కషన్ మొదలైంది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న తారక్.. తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో నటించాల్సి ఉంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ విషయంలో పెద్ద చర్చే జరుగుతోంది. రీసెంట్‌‌ గా మైత్రి సంస్థ న్యూక్లియర్, మిస్సైల్ అనే రెండు టైటిల్స్‌ని రిజిస్ట్రేషన్ చేయించింది. వీటిలో ఏదో ఒక టైటిల్ ఎన్టీయార్ సినిమాకి పెడతారనేది అందరి అంచనా. మరోపక్క తారక్ బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ నీల్ చేసిన ట్వీట్, ప్రశాంత్ పుట్టిన రోజున మైత్రి సంస్థ చేసిన ట్వీట్ సినీ వర్గాల్లో డిస్కషన్‌‌కి దారితీశాయి. ‘మీరు పక్కనుంటే న్యూక్లియర్ ‌ప్లాంట్‌‌ దగ్గర కూర్చున్న భావన కలుగుతుంది. త్వరలో రేడియేషన్‌‌ సూట్‌ ‌ధరించి మీ వద్దకు రాబోతున్నా’ అని ప్రశాంత్‌‌ నీల్ ట్వీట్ చేస్తే, ‘త్వరలో మిమ్మల్ని రేడియేషన్‌ ‌సూట్‌‌లో కలవబోతున్నాం’ అని మైత్రి ట్వీట్ చేసింది. ఈ రెండు ట్వీట్లని బ‌‌ట్టి ఎన్టీయార్, ప్రశాంత్ చిత్రానికి ‘రేడియేషన్’ అనే టైటిల్‌‌ని ఫిక్స్ చేయబోతున్నారనే ప్రచారం కూడా జోరందుకుంది. మరి న్యూక్లియర్, మిస్సైల్, రేడియేషన్.. ఈ మూడింట్లో ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారో, మూడూ కాకుండా మరేదైనా టైటిల్‌‌ని తెరమీదికి తీసుకొస్తారో చూడాలి.

For More News..

మొదట 19 లక్షల కరెంట్ బిల్లు.. లొల్లి చేస్తే రూ.1,000కి తగ్గింది

కరోనాతో రాత్రంతా కర్ఫ్యూ.. రెచ్చిపోతున్న దొంగలు

కేటీఆర్ వీడియో షేర్ చేసిన రేవంత్ రెడ్డి

Latest Updates