కరోనా నివారణకు రూ. రెండు కోట్ల విరాళం

కరోనా కట్టడికి జనసేన అధినేత, సినీహీరో పవన్ కళ్యాణ్ రెండు కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలకు విడివిడిగా రూ.50 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ప్రధాని రిలీఫ్ ఫండ్‌కు కూడా రూ. కోటి విరాళంగా ప్రకటిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఇలాంటి అల్లకల్లోల సమయంలో.. ఆదర్శప్రాయమైన మరియు ఉత్తేజకరమైన మోడీ నాయకత్వం ఈ దేశాన్ని కరోనా మహమ్మారి నుండి కాపాడగలుగుతందని ఆయన అన్నారు. రెండు రోజుల క్రితం యంగ్ హీరో నితిన్ రెండు రాష్ట్రాలకు విడివిడిగా రూ. 10 లక్షలు విరాళంగా ప్రకటించారు. మోడీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది.

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41కి చేరింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 10కి చేరింది. దాంతో రెండు రాష్ట్రాలు హైఅలర్ట్ ప్రకటించాయి.

For More News..

కరోనా దెబ్బకు జనాభా లెక్కలు వాయిదా

తెలంగాణలో పెరిగిన పాజిటివ్ కేసులు

దేశవ్యాప్తంగా టోల్‌ట్యాక్స్‌ రద్దు

ప్రపంచ వ్యాప్తంగా 5 లక్షలకు చేరువలో కరోనా కేసులు

Latest Updates