సినిమా వాళ్ళు అంటే చంపేస్తారా..రాహుల్ సిప్లి గంజ్ కు అండగా విలక్షణ నటుడు

సింగర్, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అండగా నిలిచారు. పబ్ లో జరిగిన గొడవలో రాహుల్ తప్పేమీ లేదు. తప్పులేనప్పుడు రాహుల్ ఎందుకు కాంప్రమైజ్ కావాలి. నా పర్సనల్ పనిమీద ప్రభుత్వ విప్  వినయ్ భాస్కర్ ను కలిసేందుకు అసెంబ్లీకి వెళ్లాను. పబ్ కు వెళ్లడం తప్పు కాదు పబ్లిక్ ప్లేస్ లో 10 మంది కలిసి ఒక్కరిని కొట్టడం దారుణం. సినిమా వాళ్ళు అంటే చంపేస్తారా ఏంటని ప్రకాష్ రాజ్  ప్రశ్నించారు.
ఈ సందర్భంగా  రాహుల్ సిప్లి గంజ్ కు అన్యాయం జరిగింది. అతనికి నేను అండగా ఉంటాను.  పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి రాహుల్ కు న్యాయం జరిగేలా చూస్తానంటూ ప్రకాష్ రాజ్  హామీ ఇచ్చారు.

కాగా ఇటీవల రాహుల్ సిప్లిగంజ్ పై గచ్చిబౌలి ప్రిజమ్ పబ్ లో దాడి జరిగింది. ఈ దాడిలో తనకు న్యాయం చేయాలని కోరుతూ దాడికి సంబంధించిన వీడియోలను ట్వీట్టర్ లో మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేశారు.

Latest Updates