రజనీకాంత్‌కు మరో ప్రతిష్టాత్మక అవార్డు

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డు దక్కింది. ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు సంబంధించి 50వ ఎడిషన్ ప్రారంభోత్సవం గోవాలోని శ్యామ్ ప్రసాద్ స్టేడియంలో జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్, తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌లు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా రజనీకాంత్‌కు ‘ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ ’ అవార్డు దక్కింది. ఈ అవార్డును రజనీకి అమితాబ్ బచ్చన్ తన చేతుల మీదుగా అందించారు. అవార్డు అందుకున్న రజనీకాంత్.. నా సినీ జీవితంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ అవార్డును అంకితమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇదే కార్యక్రమంలో ఇటలీ నటీమణి ఇసాబెల్లా హుప్పర్ట్ లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి కరణ్ జోహర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మినిష్టర్ ప్రకాశ్ జవదేకర్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ తదితరులు హాజరయ్యారు.

Latest Updates