కరోనాతో పోరాడుతున్న హీరో రాజశేఖర్

యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్ పరిస్థితి విషమంగా ఉంది. ఆయన మరియు ఆయన భార్యా పిల్లలు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. అయితే ఆయన పిల్లలు శివాని, శివాత్మిక కరోనా నుంచి కోలుకున్నారు. కానీ, హీరో రాజశేఖర్ మరియు ఆయన భార్య జీవిత ఇంకా కరోనా నుంచి కోలుకోలేదు. అయితే హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తాజాగా ఆయన కూతురు శివాత్మిక ట్వీట్ చేసింది. తన తండ్రి త్వరగా కోలుకొని ఇంటికి తిరిగిరావలని కోరుకుంటూ అభిమానులందరిని ప్రార్థన చేయమని కోరింది.

‘కోవిడ్‌తో నాన్నా పోరాటం చాలా కష్టంగా ఉంది. అయినప్పటికీ ఆయన కరోనాతో చాలా గట్టిగానే పోరాడుతున్నారు. మీ ప్రార్థనలు, ప్రేమ, మరియు అభిమానాలు మమ్మల్ని రక్షిస్తాయని మేం నమ్ముతున్నాం. నాన్నా త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ ప్రేమ, అభిమానాలతో ఆయన త్వరగానే కోలుకొని బయటకు వస్తాడు’అని ట్వీట్ చేసింది.

కాగా.. ‘నా తండ్రి కరోనాతో పోరాడుతున్న విషయం నిజమే. కానీ ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉంది. మెల్లగా కోలుకుంటున్నారు. మీ ప్రార్థనలు, ప్రేమ మాకెంతో అవసరం. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన పడవద్దు. దయచేసి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయోద్దని మనవి చేస్తున్నాను’ అని ఆమె మరో ట్వీట్ చేసింది.

For More News..

ఆంధ్రాకు కేంద్రం హెచ్చరిక.. కరోనా డేంజర్ జిల్లాల్లో 5 ఏపీ జిల్లాలు

డిసెంబర్ 1 నుంచి ఇంజనీరింగ్ ఫస్టియర్ క్లాసులు

టెట్ ఒక్కసారి రాస్తే చాలు.. లైఫ్​టైమ్ వ్యాలిడిటీ

Latest Updates