డిసెంబర్ 31న కొత్త పార్టీపై రజినీకాంత్ ప్రకటన

సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్తపార్టీ గురించి ఆయన అభిమానులు ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారందరికీ ఆయన శుభవార్త చెప్పారు. డిసెంబర్ 31న కొత్త పార్టీ గురించి ప్రకటిస్తానని ఆయన ట్వీట్ చేశారు.

రజినీకాంత్ గత సోమవారం తన రజిని మక్కల్ మండ్రం ఫోరమ్ సీనియర్లతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో జిల్లా ఆఫీసు బేరర్లు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆ రోజు తన పార్టీ గురించి త్వరలో నా నిర్ణయాన్ని ప్రకటిస్తానని రజినీకాంత్ తెలిపారు. చెప్పినట్లుగానే ఆయన గురువారం తన కొత్త పార్టీ గురించి ఓ ట్వీట్ చేశారు. డిసెంబర్ 31న పార్టీ గురించి ప్రకటన చేసి.. జనవరిలో పార్టీ కార్యాకలాపాలు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.

For More News..

ఎమ్మెల్యే నోముల అంత్యక్రియలు పూర్తి

నగరంలో 92 మంది పోలీసుల సస్పెన్షన్ నిజం కాదు

క్లాస్‌రూంలో పెళ్లి చేసుకున్న ఇంటర్ విద్యార్థులు

Latest Updates