అభిమాని కాళ్లు పట్టుకున్న రజనీకాంత్

రజనీకాంత్ కనిపిస్తే ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. అలాంటిది రజనీ స్వయంగా ఓ అభిమాని కాళ్లు పట్టుకోవడం ఎంతోమందిని ఆశ్చర్యపరుస్తోంది. కేరళకు చెందిన ప్రణవ్ అనే దివ్యాంగుడికి రజనీ అంటే చాలా ఇష్టం. ఆయన్ని కలవాలని కలలు కన్నాడు. ఈ విషయం ఎలాగో రజనీకి తెలిసింది. ఆయన ప్రణవ్‌‌ని తన ఇంటికి ఆహ్వానించారు. అతను రావడానికి టికెట్స్‌‌ కూడా ఆయనే బుక్‌‌ చేయించారట. సంతోషంగా వచ్చిన ప్రణవ్​.. తన కాళ్లతో గీసిన రజనీ చిత్రాన్ని తీసుకొచ్చి ఆయనకు బహుమతిగా ఇచ్చాడు. దాన్ని ఆనందంగా అందుకున్న రజనీ.. కాలు పట్టుకుని కృతజ్ఞతలు చెప్పారు. అప్పుడు తీసిన ఈ ఫొటో నెట్‌‌లో వైరల్ అయ్యింది. భుజం తట్టి థ్యాంక్స్ చెప్పొచ్చు, కానీ కాలు పట్టుకోవడం ఆయన పెద్ద మనసుకు నిదర్శనం అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. తెరమీదే కాదు, తెర వెనుక కూడా ఆయన హీరోనే అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏముంటుంది!

Latest Updates