ఇంటర్ విద్యార్థులకు హీరో రామ్ ‘ఇస్మార్ట్ సందేశం’

టాలీవుడ్ సినీ హీరో రామ్ పోతినేని ఇంటర్ విద్యార్థులకు తనదైన స్టైల్లో మెసేజ్ ఇచ్చారు. “ఇంటర్ ఫలితాలే జీవితం అనుకునే నా తమ్ముళ్లకి, చెల్లెళ్లకి చెబుతున్నా. మీరు జీవితంలో అవ్వబోయేదానికి.. చేయబోయేదానికి .. ఇంటర్ రిజల్ట్ అనేది ఒక డ్యాష్ తో సమానం. దయచేసి లైట్ తీసుకోండి” అని రామ్ పోతినేని మెసేజ్ ఇచ్చారు. తాను కూడా ఇంటర్ పూర్తిచేయలేదని రామ్ చెప్పారు.

విద్యార్థులకు మంచి సందేశం ఇవ్వాలంటే ఇలాగేనా అని కొందరు అభ్యంతరాలు చెప్పడంతో.. రామ్ మరో పోస్ట్ పెట్టారు.

“పార్కుల్లో కూర్చుని బిస్కెట్లు తినే పిల్లలకు ఎలా చెప్పినా వింటారు. బెడ్ రూమ్ లో లాక్ చేసుకుని… లైఫ్ ఎలారా అనుకునే పిల్లలకు నిజాలు ఇలా చెబితేనే వింటారు. స్టూడెంట్స్ పై నాకు ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. ఇంటర్ కూడా పూర్తిచేయకుండా.. క్రికెట్ లో దేశానికి గర్వకారణంగా నిలిచిన సచిన్ టెండూల్కర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు” అని రామ్ ట్వీట్ చేశారు.

రామ్ చేసిన ట్వీట్ ను… వేల సంఖ్యలో రీట్వీట్ చేశారు యూత్. ఈ మెసేజ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

 

 

Latest Updates