ఛాలెంజ్ లో భార్యకు కాఫీ చేసి ఇచ్చిన రాంచరణ్

కరోనా వైరస్ నియంత్రణకు ప్రధాని మోడీ దేశం మొత్తం లాక్డౌన్ విధించారు. దాంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్డౌన్ కు ముందు చాలామంది మగవాళ్లు బయటి పనుల వల్ల ఇంట్లో ఆడవాళ్లకు ఎటువంటి సాయం చేయకపోయేవారు. కానీ, ఇప్పుడు లాక్డౌన్ పుణ్యమా అని మగవాళ్లు ఇంట్లోనే ఉండటంతో.. ఇప్పుడైనా ఆడవాళ్లకు ఇంటి పనుల్లో హెల్ప్ చేసి వారి వర్క్ లోడ్ ను తగ్గించాలని భావిస్తున్నారు.

సోమవారం దర్శకుడు రాజమౌళి తన ఇంట్లో పనులన్నీ చేసి తన భార్యకు సాయం చేశాడు. ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి.. ఎన్టీఆర్, రాంచరణ్ లతో పాటు మరికొంత మందికి ‘బీ ద రియల్ మ్యాన్’ పేరుతో ఛాలెంజ్ విసిరాడు. ఆ ఛాలెంజ్ కి ఇప్పటికే ఎన్టీఆర్ స్పందించి టాస్క్ కంప్లీట్ చేసి.. తన వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశాడు.

ఇప్పుడు మెగా హీరో రాంచరణ్ వంతు వచ్చింది. రాజమౌళి సవాల్ ను స్వీకరించిన ఆయన.. ఇంట్లో బట్టలను వాషింగ్ మెషిన్ లో వేయడం, ఫ్లోర్ తుడవడం, మొక్కలకు నీళ్లు పోయడం లాంటివి చేశారు. చివరగా భార్య ఉపాసనకు ప్రేమతో కాఫీ కలిపి తీసుకెళ్లి ఇచ్చి తన టాస్క్ ను పూర్తి చేశాడు. చరణ్ కాఫీ ఇచ్చే సమయానికి ఉపాసన సోఫాలో కూర్చొని మ్యాగ్జైన్ చదువుతుంది.

‘ఇంట్లో పనులను చేయడంలో కూడా గర్వపడదాం! ఆడవాళ్ల పని భారాన్ని పంచుకోవడం ద్వారా నిజమైన పురుషులుగా ఉందాం, మహిళలకు సహాయం చేద్దాం’ అని రాంచరణ్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

‘బీ ద రియల్ మ్యాన్’ పేరుతో ఉన్న ఈ చాలెంజ్ ను మెగా హీరో రాంచరణ్.. బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్, రాణా దగ్గుబాటి, శర్వానంద్ లకు  సవాల్ చేశాడు.

For More News..

రేషన్ షాపుల్లో మాస్కుల అమ్మకం

చీపురు పట్టి ఇల్లు ఊడ్చి, తుడిచిన యంగ్ టైగర్

ఎన్టీఆర్, రాంచరణ్ లకు సవాల్ విసిరిన రాజమౌళి

గ్రీన్‌ జోన్‌లోకి తెలంగాణలోని ఏడు జిల్లాలు

Latest Updates