షూటింగ్ తర్వాత కూడా నేను, సమంత అదే మూడ్‌‌లో ఉండేవాళ్లం

ఊరకే సూపర్ స్టార్స్ అవ్వరు!

సినిమా సినిమాకీ వైవిధ్యతను ప్రదర్శించే శర్వానంద్.. ఈ సారి ‘జాను’కి ప్రేమికుడిగా మారాడు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో శర్వా ఇలా ముచ్చటించాడు.

క్లాసిక్ మూవీని రీమేక్ చేయడం ఎందుకని దిల్ రాజు గారిని అడిగా. ‘నన్ను నమ్ము ఈ సినిమా కచ్చితంగా వర్కవుటవుతుంది’ అన్నారు. నాకు రాజు గారి మీద, ఆయన జడ్జిమెంట్ మీద  నమ్మకం ఉంది. ఆయన కాకుండా వేరేవాళ్లయితే ఈ సినిమా చేసేవాణ్ని కాదు. ఇప్పుడు గతంలో ఎన్నడూ రాని అప్లాజ్ వస్తోంది. ఈ సినిమా చేయకపోతే ఎంత మిస్సయ్యేవాణ్నో అనిపిస్తోంది.

షూటింగ్‌‌లో పాల్గొనేటప్పుడు ఫస్ట్ రెండు, మూడు సీన్లు నాకేమీ అర్ధం కాలేదు. డైరెక్టర్ నన్ను విజయ్ సేతుపతిలా చేయమంటున్నాడేంటి అనుకున్నాను. కానీ ఆ పాత్రని ఆయన ఎంత లోతుగా ఆలోచించి రాసుకున్నాడో తర్వాత అర్ధమయింది. ఇప్పటి వరకు చేసిన  సినిమాల్లో నేను బాగా కష్టపడిన సినిమా ఇదే.

కెన్యా, మాల్దీవుల్లో షూట్ చేశాం. మాల్దీవుల్లో చేతికి గాయం అయింది. ఓ పక్క సమంత  లాంటి అగ్ర నటితో నటించాలి.  కొంచెం అటూ ఇటూ ఐతే ట్రోల్స్ చేస్తారు. అందుకే చాలా భయం వేసేది. సమంత కాకుండా వేరెవరూ ఈ పాత్ర చేయలేరు. షూట్ పూర్తయ్యాక కూడా సమంత, నేను సినిమా మూడ్‌‌లోనే ఉండేవాళ్లం. సెకెండ్ హాఫ్ మొత్తాన్నీ రెండు పాత్రలపై నిలబెట్టడం పెద్ద చాలెంజ్. అది దర్శకుడు చక్కగా చేశాడు. రీమేక్ కి మార్పులు చేద్దామనుకున్నారు కానీ చేయలేదు.

రీమేక్ చేయాలంటే చాలా  ప్రెజర్ ఉంటుంది. క్లాసిక్స్ అంటే ఇంకా ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే ఒరిజినల్‌‌లో చేసిన నటులతో  పోలికలు చేస్తుంటారు. కానీ రీమేక్‌‌లా లేదు, ఫ్రెష్  సినిమా చేసినట్టుందని చాలా మంది చెప్పడం.. త్రిష, విజయ్ సేతుపతి గుర్తు రాలేదని కొందరు చెప్పడం హ్యాపీగా అనిపించింది.  ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ అంటే కామెడీనే కాదు, రెండున్నర గంటలు ప్రేక్షకులను కూర్చోబెట్టగలిగామంటే ఎంటర్‌‌‌‌టైన్ చేసినట్టే.  ఆ  క్రెడిట్ అంతా దర్శకుడికే  వెళ్తుంది.

సమంత దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ఎవరూ ఊరకే సూపర్ స్టార్స్ అవ్వరు. తనో స్టార్ అని, అక్కినేని ఫ్యామిలీ మెంబర్​ అని ఏ మాత్రం గర్వం ఉండదు తనలో. షూటింగ్ సమయంలో కూడా తన దగ్గర  కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అక్కినేని ఫ్యామిలీ నుంచి అమల గారితో కూడా ఒక సినిమాలో కలిసి నటిస్తున్నాను.

Latest Updates