పోలీసుల అదుపులో నటుడు శివాజీ

సినీ నటుడు శివాజీని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ( బుధవారం) శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి  దేశం విడిచి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అలంద మీడియా కేసులో అదుపులోకి తీసుకున్న శివాజీని సైబర్  క్రైం పోలీస్ స్టేషన్ కు తరలించారు. గత రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న శివాజీ కోసం పోలీసులు  గాలిస్తున్నారు.

మరోవైపు తనపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ శివాజీ  కోర్టును ఆశ్రయిస్తూ…పోలీసులు ముందస్తు అరెస్ట్‌ చేయకుండా స్టే ఇవ్వాలని పిటీషన్‌లో కోరాడు.

Latest Updates