విమర్శలకు చెక్..సీఎం ఉద్ధవ్ ను కలిసిన సోనూసూద్

వేలాది వలస కార్మికులకు సాయం చేసిన యాక్టర్ సోనూసూద్ ఆదివారం  మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను, ఆయన కొడుకు రాష్ట్ర మంత్రి ఆధిత్య థాక్రేను కలిశారు. ఈ సందర్బంగా సోనూసూద్ చేస్తున్న సాయంపై సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రశంసలు కురిపించారు.వలస కార్మికులు పడుతున్న కష్టాలపై చర్చించారు. సాయం చేయాలని ఎవరైనా తనను సంప్రదిస్తే తప్పకుండా సాయం చేస్తానన్నారు సోనూసూద్.

అయితే సోనూసూద్ పై  శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు చేశారు. సోనూసూద్ బీజేపీకి సంబంధాలున్నాయన్నారు. ఆ పార్టీ పత్రిక సామ్నావీక్లీ కాలమ్ లో సోనూ సూద్ సాయం రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు. ఉన్నట్టుండి ఆయనమహాత్ముడు కావడం వెనక రాజకీయ కోణం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి బీజేపీ ఆడుతున్న నా టకంలో సోనూ సూద్ ఓ పాత్ర అన్నారు. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 85 వేలు దాటగా.. మరణాల సంఖ్య 3 వేలు దాటింది.

 

see more news

పర్సనల్‌‌ వెహికల్స్‌‌కు దేశమంతా ఒకే రోడ్‌‌ ట్యాక్స్‌‌!

ఆధార్ ​కార్డు తెస్తెనే నర్సన్న దర్శనం

Latest Updates