‘ఆచార్య’ సిబ్బందికి సోనూసూద్ ‘స్మార్ట్’ గిఫ్ట్స్

కోవిడ్ సమయంలో ఎంతో మంది వ‌ల‌స కూలీల‌కు, పేద‌ల‌కు సాయమందించి రియ‌ల్ హీరో అనిపించుకున్న‌ న‌టుడు సోనూసూద్.. మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు. ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’ షూటింగ్‌లో పాల్గొంటున్న ఆయ‌న‌.. పేద సినీ కార్మికుల కోసం తాజాగా త‌న‌వంతు సాయం చేశాడు. ఆచార్య సినిమా కోసం ప‌నిచేస్తున్న సిబ్బందికి 100 స్మార్ట్‌ఫోన్లు అంద‌జేశాడు. సినిమా కోసం ప‌నిచేస్తున్న‌ సిబ్బంది.. స్మార్ట్ ఫోన్ కొనే ప‌రిస్థితిలో లేర‌ని గ్రహించి, వారికి 100 స్మార్ట్ ఫోన్ల‌ను స్వ‌యంగా అందజేసి మాన‌వ‌తా హృద‌యాన్ని చాటుకున్నాడు.

Latest Updates