మానసిక సమస్యలు తగ్గుతలేవని సుశాంత్..

సుశాంత్​కు ట్రీట్​మెంట్​ చేసిన ఇద్దరు సైకియాట్రిస్టుల స్టేట్ మెంట్  

ముంబై: బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డిప్రెషన్, యాంగ్జైటీ, మూడ్ తరచూ మారిపోయే బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక సమస్యలతో బాధపడ్డాడని, ఆయనకు చివరి రోజుల్లో వేర్వేరుగా ట్రీట్ మెంట్ చేసిన ఇద్దరు సైకియాట్రిస్టులు వెల్లడించారు. సుశాంత్ మందులు మానేయడంతో సమస్యలు పెరిగాయని, అతనికి ట్రీట్ మెంట్ చేయడం కష్టమైందని వారు ముంబై పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చారు. సుశాంత్ డెత్ కేసులో సీబీఐ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా, డాక్టర్ల స్టేట్ మెంట్లను రికార్డు చేశారు. తనకు ఉన్న బైపోలార్ డిజార్డర్ సమస్య నుంచి ఎన్నడూ బయటపడలేనని, తన వల్ల తన ఫ్యామిలీ సఫర్ అవుతుందని సుశాంత్ బాధపడేవాడని ఒక సైకియాట్రిస్ట్ చెప్పారు. ఒక నిమిషం కూడా తనకు ఎన్నో రోజులుగా అనిపిస్తున్నట్లు చెప్పాడని తెలిపారు. సుశాంత్ డెత్ కేసులో నిందితురాలిగా ఉన్న అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి తమతో కంటిన్యూగా టచ్ లో ఉందని, సుశాంత్ హెల్త్ విషయంలో ఎప్పుడూ వర్రీ అయ్యేదని ఆ ఇద్దరు డాక్టర్లు చెప్పారు. మెంటల్ డిజార్డర్ల వల్ల సుశాంత్ కు ఆకలి, నిద్ర కూడా సరిగ్గా ఉండేవి కావని, ఇలాంటి మానసిక సమస్యలకు మందులను ఆపేయడం వల్ల పరిస్థితి మరింత క్షీణిస్తుందని, సూసైడ్ ఆలోచనలు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నారు.

మీడియా నిగ్రహం పాటించాలి: బాంబే హైకోర్ట్

సుశాంత్ డెత్ కేసులో ఇన్వెస్టిగేషన్ పై వార్తలను ప్రసారం చేయడంలో మీడియా నిగ్రహం పాటించాలని గురువారం బాంబే హైకోర్టు చెప్పింది. ఇన్వెస్టిగేషన్ కు ఆటంకం కలిగించే రీతిలో వార్తలు రిపోర్ట్ చేయరాదని సూచించింది. సుశాంత్ కేసులో ‘మీడియా ట్రయల్’ జరుగుతోందని, దీనిని ఆపాలంటూ దాఖలైన రెండు పిటిషన్లను కోర్టు విచారించింది. వీటిపై విచారణకు ముందు కేంద్రం, సీబీఐ అభిప్రాయాలు తెలుసుకుంటామని చెప్తూ, తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. కాగా, సుశాంత్ డెత్ కేసుతో సంబంధం ఉన్న ఓ డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులో జైద్ విలత్రా (21) అనే డ్రగ్ డీలర్ ను ముంబైలోని ఓ కోర్టు గురువారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కస్టడీకి అప్పగించింది. అతడికి ఈ నెల 9 వరకు రిమాండ్ విధించింది.

For More News..

హెల్ప్ చేయమంటే చంపేశారు

కరోనా రూల్స్​ పాటించలేదని 2 లక్షల చలాన్లు

టూరిస్ట్​ సెంటర్​గా మారనున్న పీవీ ఊళ్లు

Latest Updates