కరోనా బారినపడి కోలుకుంటున్న నటుడు విజయ్‌కాంత్

నటుడు, దేశీయ ముర్పోక్కు ద్రావిడ కజగం (DMDK) పార్టీ వ్యవస్థాపకుడు విజయకాంత్ కరోనా బారినపడ్డాడు. ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో చెన్నైలోని MIOT ఆస్పత్రిలో సెప్టెంబర్ 22న కరోనా పరీక్ష చేయించుకున్నారు. ఆ ఫలితాల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయింది. దాంతో ఆయన అదే ఆస్పత్రిలో అడ్మిట్ అయి చికిత్స తీసుకుంటున్నారు. అయితే విజయకాంత్‌కి కరోనా సోకిందని తెలియగానే.. ఆయన అభిమానులు, పార్టీ సభ్యులు మరియు పలువురు నటులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

కాగా, గురువారం MIOT ఆస్పత్రి వైద్యులు.. నటుడు విజయకాంత్ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. ఆయన చికిత్సకు బాగా సహకరిస్తున్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వారు తెలిపారు. అంతేకాకుండా త్వరలోనే విజయకాంత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వైద్యులు తెలిపారు.

విజయకాంత్‌ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని చాలామంది ప్రముఖులు, అభిమానులు ట్వీట్ చేశారు. నటుడు శరత్ కుమార్ కూడా విజయకాంత్ ఆరోగ్యం బాగుపడాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు.‘DMDK నాయకుడు మరియు స్నేహితుడు మిస్టర్ విజయకాంత్ కరోనా ఇన్ఫెక్షన్ నుండి కోలుకొని.. త్వరలోనే తిరిగి వస్తారని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని ఆయన ట్వీట్ చేశారు.

For More News..

గ్రామంలో గొడవ.. లెటర్ రాసి ఆత్మహత్యాయత్నం చేసిన మహిళా సర్పంచ్

వీడియో: పుట్టిన ఆర్నెళ్లకే స్కీయింగ్ చేసి రికార్డ్‌కెక్కిన బుడతడు

తెలంగాణలో కొత్తగా 2,176 కరోనా కేసులు

Latest Updates