సినీ నటుడు విష్ణు విశాల్ తో బ్యాడ్మింట‌న్ స్టార్ గుత్తా జ్వాల నిశ్చితార్ధం

భారత బ్యాట్మింటన్ ప్లేయర్.. హైదరాబాదీ గుత్తాజ్వాలకు , త‌మిళ యంగ్ హీరో విష్ణు విశాల్ తో నిశ్చితార్ధం జ‌రిగింది. ప్రస్తుతం కోచింగ్ రంగంలో ఉంది.. ఇవాళ ఆమె పుట్టిన రోజు సంద‌ర్భంగా హైదరాబాద్ వచ్చిన విష్ణు విశాల్…ఆమె చేతికి రింగ్ తొడిగాడు.గుత్తా జ్వాల కూడా విశాల్ కు రింగ్ తొడిగింది. త్వ‌ర‌లోనే ఈ ఇద్ద‌రు పెళ్లి పీట‌లు ఎక్క‌నున్నారు.

గుత్తా జ్వాలా గ‌తంలో తోటి క్రీడాకారుడు చేత‌న్ ఆనంద్ ను వివాహం చేసుకుని తర్వాత విడాకులు తీసుకుంది. ఇక విశాల్ కు కూడా గ‌తంలో వివాహ‌మైంది. గ‌తేడాది భార్య ర‌జ‌నీకి విడాకులు ఇచ్చాడు. అప్ప‌టి నుంచి విశాల్ ఈ బ్యాడ్మింట‌న్ స్టార్ ప్రేమ‌లో ఉన్నాడు.

Latest Updates