పూర్తిగా ఎంజాయ్ చేయలేరు : అందుకే పిల్లలొద్దు!

సోనీ టీవీలో ప్రసారమవుతున్న ‘ఎఫ్.ఐ.ఆర్’ ద్వారా ప్రేక్షకులకు చేరువైన నటి కవితా కౌశిక్,  రెండేళ్లక్రితం రోనిత్​ బిశ్వాస్​ను పెళ్లి చేసుకుంది. అయితే భవిష్యత్తులో పిల్లల్ని కనే ఉద్దేశం లేదని కవిత తెలిపింది. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ​ ఈ విషయంలో భర్త రోనిత్, తానూ ఒకే అభిప్రాయంతో ఉన్నామని చెప్పింది. ‘‘ప్రస్తుతం ఇద్దరం నలభై ఏళ్లకు దగ్గరగా ఉన్నాం. ఇప్పట్లో పిల్లల్ని కనాలనుకోవడం లేదు. పోనీ కొంతకాలం తర్వాత పిల్లల్ని కంటే అప్పటికే మాకు నలభై ఏళ్లొస్తాయి.

పిల్లలకు ఇరవై ఏళ్లొచ్చేసరికి మాకు అరవై వచ్చి, ముసలోళ్లం అవుతాం. అంటే మా పిల్లలు ఇరవై ఏళ్లలోనే వృద్ధులైన తల్లిదండ్రులను (మమ్మల్ని) చూసుకోవాల్సి వస్తుంది. దీంతో వాళ్ల యవ్వనంలో చాలా త్యాగాలు చేయాల్సి వస్తుంది. జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయలేరు. పైగా ఇంత జనాభాతో నిండిన ముంబై నగరంలోకి వాళ్లను తీసుకురాలేం. అందువల్ల పిల్లల్ని కని వాళ్లను ఇబ్బందిపెట్టేకన్నా, మా జీవితాన్ని పరిపూర్ణంగా గడపాలనుకుంటున్నాం. నా భర్తకు నేను అమ్మలా ఉంటే.. ఆయన నాకు తండ్రిలా ఉంటారు’’ అని కవితా కౌశిక్​ తెలిపింది.

Latest Updates