శ్రీదేవి లాంటి వాళ్లకే తప్పలేదు

హీరో హీరోయిన్లకు పేరు, డబ్బే కాదు.. ఒక్కోసారి తలనొప్పులు కూడా వస్తుంటాయి. మెహ్రీన్‌‌కి ఇలాంటి సమస్యే ఒకటి ఎదురైంది. రీసెంట్‌‌గా ఆమె నటించిన ఎంత మంచివాడవురా, పట్టాస్, అశ్వథ్థామ చిత్రాలు రిలీజయ్యాయి. మిగతా సినిమాల సంగతెలా ఉన్నా.. ‘అశ్వథ్థామ’ విషయంలో ఒక చిన్న సమస్య ఎదురైంది. రిజల్ట్ పరంగా కాదు.. పర్సనల్‌‌గా. ఈ సినిమా ప్రమోషన్స్‌‌కి  మెహ్రీన్​ హాజరవలేదని, నిర్మాతలు మెహ్రీన్​ స్టే చేసిన హోటల్​ బిల్లు కూడా కట్టలేదంటూ ప్రచారం జరుగుతోంది. మొదట మౌనంగానే ఉన్నా, ప్రచారం ఎక్కువవుతూ ఉండటంతో ఒక నోట్ విడుదల చేసింది మెహ్రీన్. అసలేం జరిగిందనేది అందులో వివరంగా రాసింది.

‘‘మా తాత గారికి గుండెపోటు రావడం వల్ల షూటింగ్ ముగిసిన వెంటనే నేను మా ఊరికెళ్లాల్సి వచ్చింది. ఈ విషయం నాగశౌర్య కూడా ఇంటర్వ్యూలో చెప్పారు. నేను హైదరాబాద్​ తిరిగి రావడం కాస్త లేటయ్యింది. అయినా నేను అన్నిటికీ హాజరయ్యాను.. ఒక్క ఇంటర్వ్యూకి తప్ప. ఆ రోజు నాకు ఒంట్లో బాలేదు. ముఖమంతా ర్యాష్‌‌ ఉండటంతో రాలేనని నిర్మాతలతో చెప్పాను. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పంపించి సారీ కూడా చెప్పాను. కానీ వాళ్లు నా హోటల్ బిల్లు, లాండ్రీ బిల్లు చెల్లించలేదని, నా పర్సనల్‌‌ టీమ్‌‌కి ఇవ్వాల్సిన మొత్తం కూడా ఇవ్వలేదని తెలిసింది. దాంతో నేనే వాటిని చెల్లించేశాను. కానీ నేనేదో ఇబ్బంది పెట్టడం వల్ల ఇలా జరిగిందంటూ రాయడం భరించలేకపోయాను. తెలుగులో ఇప్పటికి పద్నాలుగు సినిమాల్లో నటించాను. ఎప్పుడూ రాని సమస్య ఈ సినిమా వల్ల వచ్చింది. అయినా ప్రతి విషయానికీ రెండో కోణం ఉంటుంది. అది తెలుసుకోకుండా నన్ను కించపరిచేలా మాట్లాడటం తట్టుకోలేక ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది’ అంటూ వివరణ ఇచ్చింది. దాంతో నెటిజన్స్‌‌ ఆమెకి సపోర్ట్‌‌గా మాట్లాడుతున్నారు. శ్రీదేవి లాంటి వాళ్లకే ఇలాంటివి తప్పలేదు అంటూ కొందరు ధైర్యం కూడా చెప్పారు. ఏదేమైనా పని చేసే చోట కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. అవి వాళ్లలో వాళ్లే సర్దుబాటు చేసుకుంటారు. మధ్యలో వేరేవాళ్లు దూరిపోయి జడ్జ్‌‌ చేయకపోవడమే మంచిది.

For More News..

హాస్టల్ బాత్రూంలో ఇంటర్ విద్యార్థిని సూసైడ్

టీఆర్ఎస్ ​కబ్జా చేసిన భూములతో లక్షల ఇండ్లివ్వొచ్చు

ఓయూలో రేపు జాబ్​ మేళా

Latest Updates