హాలీవుడ్ ప్రాజెక్ట్‌ లో నిత్యా..!

హీరోయిన్ గా, సింగర్ గా ఆల్రెడీ నూరు మార్కులు వేయించేసుకున్న నిత్యామీనన్.. ఇప్పుడు తన టాలెంట్‌‌ని మరోలా ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతోంది. ‘ఫ్రోజెన్ 2’ తెలుగు వెర్షన్‌‌లో ‘ఎల్సా’ పాత్రకి వాయిస్ ఇవ్వనుంది. హిందీ వెర్షన్‌‌లో ఆనా, ఎల్సా పాత్రలకి ప్రియాంక, పరిణీతి డబ్బింగ్ చెబుతున్నారు. దాంతో తెలుగులో కాజల్, ఆమె చెల్లెలు నిషా చెబుతారనే వార్తలొచ్చాయి. అది నిజం కాదని తేలిపోయింది. ‘ఎల్సా’కి నిత్య వాయిస్ ఇస్తోంది.

‘ఇందులో మంచి కథ, కథనాలే కాదు.. అమ్మాయిలకి చక్కని సందేశం కూడా ఉంది. అందుకే ఓకే చెప్పా. ఎందరికో ఇష్టమైన ఈ పాత్రకి వాయిస్ ఇవ్వడం మర్చిపోలేని అనుభవంగా మిగి లిపోతుంది’ అంటూ సంతోషపడుతోంది నిత్య. ఈ నెల 22న ఇంగ్ లిష్‌‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదలవుతోంది ‘ఫ్రోజెన్ 2’. ఎల్సాకి నిత్య వాయిస్ ఎలా ఉంటుందో ఆ రోజు వినాల్సిందే.

Latest Updates