భావప్రకటనా స్వేచ్ఛ జోక్‌ గా మారింది : హీరోయిన్

బాలీవుడ్ నటి పాయల్ రోహత్గీ వివాదంలో చిక్కుకుంది. దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఫ్యామిలీ సభ్యులపై కాంట్రవర్సీ వీడియోను సోషల్ మీడియాలో పోస్టి చేసి పెద్ద వివాదానికి తెరలేపింది. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు రాజస్థాన్ పోలీసులు.

నెహ్రూ తండ్రి మోతీలాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ ఇతర కుటుంబ సభ్యులపై అభ్యంతరకర కంటెంట్‌ ను పోస్ట్‌ చేసిన పాయల్‌ పై అక్టోబర్‌ 10న బుండీ పోలీసులు నటిపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని పాయల్‌కు రాజస్ధాన్‌ పోలీసులు ఇటీవల ఆమెకు నోటీసులు జారీ చేశారు.

గూగుల్‌ నుంచి సేకరించిన సమాచారంతో తాను చేసిన పోస్ట్‌పై తనను రాజస్ధాన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారని ఇక భావప్రకటనా స్వేచ్ఛ జోక్‌ గా మారిందని పాయల్‌ ట్వీట్‌ చేశారు.పాయల్‌ రోహత్గీని అహ్మదాబాద్‌ లోని ఆమె నివాసం నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని విచారణ కోసం ఆమెను బుండీకి తీసుకువస్తామని ఎస్పీ మమతా గుప్తా తెలిపారు. ఈ క్రమంలోనే పాయల్‌ ముందస్తు బెయిల్‌పై సోమవారం కోర్టు విచారణ చేపట్టనుంది.

Latest Updates