ఆన్ లైన్ వేదికగా మరో హీరోయిన్ కు వేధింపులు

హీరోయిన్ పూర్ణ అంటే చాలామందికి తెలియపోవచ్చు కానీ.. అవును సినిమా హీరోయిన్ అంటే చాలామందికి గుర్తుకురావచ్చు. మలయాళంలో తన తొలి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కేరళ కుట్టీ పూర్ణ.. శ్రీ మహాలక్ష్మీ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఓ పక్క సినిమాలలో నటిస్తూనే.. మరోపక్క పలు టీవీ షోలకు జడ్జీగా కూడా వ్యవహరించింది.

నలుగురు యువకులు తనను బ్లాక్ మెయిల్ చేస్తూ వేధిస్తున్నారంటూ పూర్ణ అలియాస్ శ్యామ్నా కాసిమ్ కొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా నలుగురు నిందితుల్ని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్ని శరత్, రమేష్, అస్రఫ్, రఫీజ్ గా పోలీసులు గుర్తించారు. ఈ నలుగురిపై గతంలోనూ వేధింపుల కేసులున్నాయి. నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. డబ్బు కోసం వీరంతా.. ఒకరికి ఒకరు సంబంధంలేనట్లుగా వేరువేరు నంబర్ల ద్వారా పూర్ణకు ఫోన్ చేసి వేధించారు. కానీ.. వీరిని అదుపులోకి తీసుకున్న తర్వాత అసలు విషయం తెలిసింది. వీరంతా ప్లాన్ ప్రకారమే.. విడివిడిగా ఫోన్లు చేసినట్లు తెలిసింది.

ఈ మధ్యే జరిగిన మీరా చోప్రా వేధింపుల గురించి మరవక ముందే మరో హీరోయిన్ వేధింపులకు గురికావడం గమనార్హం. నిందితులు ఆన్ లైన్ వేదికగా వేధింపులకు పాల్పడుతుండటంతో.. జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

For More News..

గేమ్ టాస్క్ కంప్లీట్ చేయలేక టీనేజర్ సూసైడ్

కరోనా ఎఫెక్ట్: హైదరాబాద్ లో పలు ప్రాంతాలు మూసివేత

బలవంతంగా పురుగుల మందు తాగించి..

న్యూజెర్సీలో కొత్త ఇంటి స్విమ్మింగ్ పూల్ లో పడి భారత కుటుంబం మృతి

Latest Updates