డ్రగ్స్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన రకుల్

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ప్రచారాలను ఆపాలంటూ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హైకోర్టును ఆశ్రయించింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి మరియు డ్రగ్స్ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి… నార్కొటిక్ అధికారుల విచారణలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు చెప్పింది. అప్పటినుంచి ఈ కేసుకు సంబంధించి రకుల్ పేరు సమాచార మాధ్యమాలలో మారుమోగుతుంది. తనపై వచ్చే ప్రసారాలను ఆపేలా చర్యలు తీసుకోవాలని రకుల్ ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించింది. దానిపై స్పందించిన హైకోర్టు.. రకుల్ ప్రీత్ చేసిన విజ్ఞప్తిపై కేంద్రం తన వైఖరిని తెలపాలని కోరింది. రకుల్ అభ్యర్ధనను ప్రాతినిధ్యంగా భావించి.. త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రం, ప్రసార భారతి మరియు ప్రెస్ కౌన్సిల్‌ను హైకోర్టు కోరింది.

For More News..

ఏకంగా నాలుగు ఎకరాల్లో గంజాయి పంట

వంతెన నిర్మాణంతో 15 కిలోమీటర్ల దూరం 1 కిలోమీటరుకు తగ్గింది

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు, ఓ మహిళ మృతి

Latest Updates