చాలామందికి ప్రేమికుల రోజంటే చిరాకు

వరుస విజయాలతో దూసుకెళ్తున్న రాశీఖన్నా.. ఫిబ్రవరి 14న ‘వరల్డ్ ఫేమస్‌‌‌‌ లవర్‌‌‌‌‌‌‌‌’తో కలిసి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ఆమె ఇలా ముచ్చటించింది.

‘‘ఇప్పటి వరకు చేసిన పాత్రలతో పోలిస్తే యామిని పాత్ర చాలా కొత్తగా, చాలెంజింగ్‌‌‌‌గా ఉంది. బోల్డ్‌‌‌‌గా ఉండే రోల్. ప్రతి అమ్మాయిలో యామిని ఉంటుంది. ఈ పాత్ర గురించి ఇంతకంటే చెప్పాలంటే స్టోరీ చెప్పాలి. కానీ చెప్పలేను. ఎందుకంటే కథలో ఒక సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ ఉంది. ఇదొక ఎమోషనల్ మూవీ. షూట్ సమయంలోనూ నేను ఎమోషనల్ అయ్యాను. సినిమా చూస్తే ప్రతి ఒక్కరూ అలాగే ఫీలవుతారు. ట్రైలర్‌‌‌‌‌‌‌‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ఇలాంటి పాత్ర ఎందుకు చేస్తున్నావ్ అని అడిగారు. కానీ సినిమా చూసిన తర్వాత తమ అభిప్రాయం మార్చుకుంటారు. నా క్యారెక్టర్ ఎంత సేపు ఉంటుంది, విజయ్‌‌‌‌తో నాకు కాంబినేషన్ సీన్స్ ఎన్ని ఉన్నాయి వంటివి ఇప్పుడు చెప్పకూడదు. ఈ టైటిల్‌‌‌‌ విజయ్ దేవరకొండకి యాప్ట్. తన కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది మరొక సూపర్ హిట్. విజయ్ ఇది లాస్ట్ లవ్ స్టోరీ అని చెప్పడం ఆయన వ్యక్తిగత అభిప్రాయం. కొందరు దీన్ని ‘అర్జున్‌‌‌‌రెడ్డి’తో పోల్చారు కానీ దానికీ దీనికీ అస్సలు సంబంధం లేదు. ఇక డైరెక్టర్ క్రాంతి మాధవ్ దగ్గర చాలా నేర్చుకున్నాను. ఆయన కథ చెబుతున్నప్పుడే వేరొక లోకానికి వెళ్లిపోయాను. ఆయనలో దర్శకుడితో పాటు ఎక్సెలెంట్ డైలాగ్ రైటర్ కూడా ఉన్నారు. ఈ సినిమాలో మంచి డైలాగులు రాశారు. వ్యాలెంటైన్స్‌‌‌‌ డేకి వస్తున్నాం. చాలామందికి ప్రేమికుల రోజంటే చిరాకు. నాకు మాత్రం చాలా ఇష్టం. ప్రేమని ఎక్స్‌‌‌‌ప్రెస్ చేసుకునే వారికి అది సరైన రోజు. ఆ రోజు మా సినిమా రావడం ఆనందంగా ఉంది. దీని తర్వాత మరో రెండు సినిమాలు చేయబోతున్నాను. వాటి వివరాలు త్వరలో చెబుతాను.’’

Latest Updates