టీడీపీ తరపున రేవతి ప్రచారం షెడ్యూల్..

actress-revathi-campaign-on-behalf-of-tdp

ఏపీలో టీడీపీ తరపున సినీ నటి రేవతి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. రాష్ట్ర హస్త కళల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పాలి ప్రసాద్‌ ఈ విషయాన్ని చెప్పారు. టీడీపీ స్టార్ క్యాంపెయినర్ లో భాగంగా  రెండు రోజుల పాటు నాలుగు నియోజకవర్గాల్లో ఆమె ప్రచారం చేయనున్నారు.  గురువారం(ఏప్రిల్ 4) ఉదయం 9 గంటలకు  ఏలూరు నియోజకవర్గంలో, సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నియోజకవర్గంలో ప్రచారం చేసి అనంతరం పాలకొల్లులో బస చేయనున్నారు. శుక్రవారం (ఏప్రిల్ 5)రోజు ఉదయం పాలకొల్లు నియోజకవర్గం, సాయంత్రం నర్సాపురం నియోజకవర్గంలో రేవతి ప్రచారం చేస్తారు.

Latest Updates