సుశాంత్ కేస్: డ్రగ్స్ లింకులో రియా చక్రవర్తి సోదరుడు అరెస్ట్

సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో డ్రగ్ లింకులపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో రియా చక్రవర్తి సోదరుడు షొవిక్ చక్రవర్తి మరియు సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండా లను అరెస్ట్ చేశారు. అంతేకాకుండా రియా చక్రవర్తి ఇంట్లో సోదాలు నిర్వహించి.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

నిన్న అరెస్టయిన డ్రగ్ సప్లయర్లు జైద్ మిలత్రా, కైజెన్ ఇబ్రహీంలతో పాటు షొవిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరాండా లను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ముంబైలోని ఎస్ ప్లనాడే కోర్టులో హాజరుపరిచారు. వీరందరికి ఈ రోజు ఉదయం కోర్టుకు తీసుకెళ్లడానికి ముందే ముంబైలోని సియోన్ హాస్పిటల్‌లో మెడికల్ టెస్టులు చేయించారు.

కాగా.. డ్రగ్ డీలర్లతో రియా సోదరుడికి లింకులు బయటపడటంతో.. రియాకు కూడా డ్రగ్ డీలర్లతో లింకులు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. రియా చక్రవర్తి, షోవిక్ చక్రవర్తిల ఫోన్లు చెక్ చేసినప్పుడు వారు డిలీట్ చేసిన డేటాలో ఓ డ్రగ్ డీలర్ సమాచారం బయటపడినట్లు అధికారులు చెప్తున్నారు. రియా సోదరుడు అరెస్ట్ కావడంతో త్వరలోనే రియా చక్రవర్తిని కూడా అదుపులోకి తీసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం మొత్తానికి సాక్షిగా ఉన్న దీపేశ్ సావంత్ స్టేట్ మెంట్‌ను నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో ఇవాళ రికార్డ్ చేసే చాన్సుంది.

సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ లింకులు ప్రూవ్ కావడంతో… నిందితుల లిస్టులోని ఒక్కొక్కరు అరెస్టవుతున్నారు. సుషాంత్ గర్ల్ ఫ్రెండ్, కేసులో ప్రధాన నిందితురాలు రియా చక్రవర్తి ఇంట్లో నిన్న నార్కొటిక్ సెంట్రల్ బ్యూరో అధికారులు సోదాలు చేశారు. విచారణ కోసం ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని తీసుకెళ్లిన పోలీసులు.. అక్కడే అరెస్ట్ చేశారు. సుశాంత్ హౌజ్ మేనేజర్ శ్యామ్యూల్ మిరాండాను కూడా నిన్న ఉదయం అదుపులోకి తీసుకుని సాయంత్రం అరెస్ట్ చేశారు. వీరి ఇళ్లల్లో కేసుకు సంబంధించి పలు ఆధారాలు, పేపర్లు లభించినట్టు సమాచారం.

For More News..

మీటర్ కరెక్ట్.. పెట్రోల్ మాత్రం ఇన్ కరెక్ట్

మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్

వలసకార్మికుల బస్సుకు ప్రమాదం.. ఏడుగురు మృతి

Latest Updates