కరోనా బాధితులకు నర్సుగా సినీ నటి సేవలు

ఓ ఆస్పత్రిలో నర్సుగా మారి కరోనా వైరస్ తో పోరాతున్న వారికి సేవలు చేస్తోంది బాలీవుడ్ నటి శిఖా మల్హోత్రా.  ఢిల్లీలోని వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజీలో శిఖా నర్సింగ్ కోర్సును పూర్తి చేసింది. అయితే తనకు   తెలిసిన విద్యను వైరస్‌తో పోరాడుతున్న వారిని కాపాడేందుకు ఉపయోగించాలనే ఈ నిర్ణయం తీసుకుట్లు ఆమె తెలిపింది. తెలిసిన విద్యను కరోనా వైరస్ రోగులకు సేవ చేసేందుకు ఉపయోగిస్తానని చెబుతోంది. దేశసేవ కోసం ఎప్పుడూ ముందుంటానన్న శిఖా… అది నర్సుగా అయినా, నటిగా అయినా వీలైనంత సేవ అందిస్తానని తెలిపింది. మీ ఆశీర్వాదం నాకు కావాలి… అందరు ఇంట్లో ఉండండి. జాగ్రత్తగా ఉంటూ.. ప్రభుత్వానికి తగిన సహకారం అందించండి అంటూ చెప్పింది  శిఖా మల్హోత్రా.

Latest Updates