సరైనోడు దొరికితేనే పెళ్లి.. లేకపోతే సింగిల్

తెలుగులో వర్షం, నువ్వొస్తానంటే వద్దంటానా వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించిన  త్రిష దక్షిణాదిన ప్రముఖ హీరోయిన్ కొనసాగుతుంది.  17 ఏళ్లుగా  తెలుగు, తమిళ సినిమాలతో అభిమానులను అలరిస్తుంది. యంగ్ హీరోలతో పాటు అగ్రహీరోల సరసన నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంది.

అయితే 37 ఏళ్ల వయసున్న త్రిష ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆ మద్యలో ఓ తెలుగు హీరోతో త్రిష లవ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తమిళ్ లో శింబుతో ప్రేమాయణం నడుపుతుందని..త్వరలో వాళ్లు పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇన్నాళ్లకు త్రిష ఓ ఇంటర్వ్యూలో తన మ్యారేజ్ గురించి క్లారిటీ ఇచ్చింది. తనను పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తి దొరికితే  తప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అది కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటానంది. ఒక వేళ తనకు తగినవాడు దొరక్కపోతే ఎలాంటి బాధ లేకుండా హ్యాపీగా  సింగిల్ గానే ఉంటానని చెప్పింది. ప్రస్తుతానికి త్రిష్ తమిళంలో పొన్నియిన్ సెల్వన్ మూవీలో నటిస్తుంది.

Latest Updates