ఎయిర్‌‌పోర్ట్‌‌ బిజినెస్‌‌ కోసం రూ.10 వేల కోట్లు

అదానీ ఎంటర్‌‌ప్రైజెస్‌‌ ప్రకటన

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌‌ కంపెనీ అదానీ ఎంటర్‌‌ప్రైజెస్ లిమిటెడ్‌‌ (ఏఈఎల్‌‌) ఎయిర్‌‌పోర్ట్‌‌ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి ప్లాన్లను రెడీ చేసింది. ఇందులో భాగంగా 2026 నాటికి రూ.10 వేల కోట్లు ఇన్వెస్ట్‌‌ చేయనుంది.  అదానీ ఎయిర్‌‌పోర్ట్స్‌‌ లిమిటెడ్‌‌ ఇటీవలే ఆరు ఎయిర్‌‌పోర్టుల కాంట్రాక్టులు దక్కించుకుంది. అహ్మదాబాద్‌‌, లక్నో, మంగళూరు నిర్వహణ బాధ్యతలను ఈ కంపెనీకి అప్పగిస్తూ ఎయిర్‌‌పోర్ట్స్‌‌ అథారిటీ ఆఫ్‌‌ ఇండియా (ఏఏఐ) ఆదేశాలు జారీ చేసింది. ఈ రూ.10 వేల కోట్లలో రూ.3,600 కోట్లను ఆరు ఎయిర్‌‌పోర్ట్‌‌ ప్రాజెక్టుల కోసం ఉపయోగిస్తామని, ఆరు వేల కోట్లను మూలధన ఖర్చులకు వాడుకుంటామని ఏఈఎల్‌‌ సీఎఫ్‌‌ఓ జుగేశిందర్‌‌ సింగ్‌‌ వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి మూడు ఎయిర్‌‌పోర్ట్‌‌ల నుంచి ఆదాయం వస్తుందని తెలిపారు. అహ్మదాబాద్‌‌, జైపూర్‌‌, లక్నో, గువాహటి, మంగళూరు, తిరువనంతపురం ఎయిర్​పోర్టుల నిర్వహణ, అభివృద్ధి బాధ్యతలను కూడా ఏఈఎల్‌‌కు ప్రభుత్వం అప్పగించింది.

Latest Updates