
న్యూఢిల్లీ: అదానీ గ్రీన్ ఎనర్జీ శ్రీలంకలో బిలియన్ డాలర్ల (రూ.8,351 కోట్లు) కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. కంపెనీ 740 మిలియన్ డాలర్ల పెట్టుబడితో మొత్తం 484 మెగావాట్ల సామర్థ్యంతో శ్రీలంకలోని మన్నార్లోని పూనేరిన్ గ్రామంలో రెండు విండ్ ఫామ్లను ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రాజెక్టులు శ్రీలంక అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్ మాత్రమే కాదు. ఇప్పటి వరకు దేశంలోనే అతిపెద్ద పవర్ ప్రాజెక్ట్ కూడా. ఈ ప్రాజెక్ట్ శ్రీలంక ఇంధన భద్రతకు దోహదపడుతుంది. సంవత్సరానికి 1,500 మిలియన్ యూనిట్ల పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. సుమారు 60 లక్షల ఇండ్లకు కరెంటు అందిస్తుంది. దాదాపు 1,200 మందికి ఉపాధి కల్పిస్తుంది.