ఇండియాకు ఏడీబీ సాయం రూ.16,500 కోట్లు

న్యూఢిల్లీ: మన దేశానికి రూ.16,500 కోట్ల సాయం అందిస్తామని ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఏడీబీ ప్రెసిడెంట్ మసత్సుగు అసకావా శుక్రవారం ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. కొవిడ్ వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన మెచ్చుకున్నారు. “ఇండియా ఎమర్జెన్సీ అవసరాలకు ఏడీబీ అండగా ఉంటుంది. రూ.16,500 కోట్ల తక్షణ సాయం అందించేందుకు ప్రిపేర్ అవుతున్నాం. అవసరమైతే మరింత సాయం పెంచుతాం. ప్రైవేటు సెక్టార్ ఫైనాన్షియల్ అవసరాలపై కూడా చర్చిస్తున్నాం” అని అసకావా అన్నారు. గ్లోబల్ ఎకనామిక్ స్లోడౌన్ వల్ల ఇప్పటికే ట్రేడ్, మ్యానుఫ్యాక్చరింగ్, టూరిజం ఇతర రంగాలపై ప్రభావం పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న మెజర్స్ వల్ల ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest Updates