చింటూ, పింటూ ఎక్కడున్నరు..?

హైదరాబాద్, వెలుగు: ‘ప్రతీ విషయంలో మేమున్నం అంటూ ముందుకు వచ్చే చింటూ, పింటూ(కేటీఆర్, హరీశ్)లు ఎక్కడ పోయిండ్రు. రాష్ట్రంలో సమస్యలు కనపడడం లేదా? ఒక్కరు కూడా మాట్లాడడంలేదు. ఒకాయన జాయ్ 2019 అంటూ విలసాలు చేస్తున్నారు. వ్యవసాయం సంక్షోభంలో ఉంటే ఆ శాఖ మంత్రి ఫుట్​బాల్ అడ్డుకుంటున్నారు. డెంగీతో ఎంతోమంది చనిపోతుంటే, గొంతు మీద కత్తి వేలాడుతోందని ఆరోగ్య మంత్రి మాట్లాడడమే లేదు. మంత్రులందరూ పదవి భయంతో ఆందోళనలో ఉన్నరు’ అని ఏఐసీసీ అధికారి ప్రతినిధి సంపత్ కుమార్, అద్దంకి దయాకర్, ఇందిరా శోభన్ ఆరోపించారు.  గాంధీభవన్ లో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యానికి రాష్ట్రంలో ముప్పు ఏర్పడింది. ప్రజాస్వామ్య వ్యవస్థను కేసీఆర్​ సర్కారు తుంగలో తొక్కింది. అన్ని వర్గాల ప్రజలూ ఇబ్బంది పడుతున్నరు. ఆర్టీసీ కార్మికుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తోంది’ అని సంపత్ కుమార్, అద్దంకి దయాకర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాటాలు సాగిస్తోందని చెప్పారు. ప్రతిపక్షాల గొంతు నొక్కాలని పాలకులు ప్రయత్నిస్తున్నారని, మరే రాష్ట్రంలోనూ ఇంత దుర్మార్గ పాలనలేదని ఆరోపించారు. ప్రజలు తిరగబడకపోతే న్యాయం జరగదన్నారు.

Latest Updates