విద్యార్థులను చితకబాదిన అదనపు డీసీపీ గంగిరెడ్డి

ఏబీవీపీ విద్యార్థులు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే అది ఉద్రిక్తతంగా మారింది.  విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనలు తెలిపారు. అసెంబ్లీ గేట్లు దూకి లోపలికి వెళ్లేందుకు యత్నించిన విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు…లాఠీ ఛార్జ్‌ చేశారు. ఇందులో బాగంగా అదనపు డీసీపీ గంగిరెడ్డి …విద్యార్థులను లాఠీతో ఇష్టం వచ్చినట్లు చితకబాదారు. అంతేకాదు ఓ విద్యార్థి చెంపపై కొట్టారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంగిరెడ్డిపై ఉన్నతాధికారులకు విద్యార్థులు ఫిర్యాదు చేస్తామన్నారు.

మరోవైపు లాఠీఛార్జ్ ను  ఖండించారు  బీజేపీ నేతలు. రాష్ట్రంలో నిజాం పాలన  నడుస్తోందని  మండిపడ్డారు  కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ . లాఠీఛార్జ్  చేసిన  పోలీసులపై  చర్యలు తీసుకోవాలని డిమాండ్  చేశారు  బీజేపీ నేత  వివేక్ వెంకటస్వామి. ఉద్యమాలను  అణచివేయటం  కేసీఆర్  తరం కాదన్నారు.

Latest Updates