సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి సురేంద్రకుమార్‌ యాదవ్ కు అదనపు భద్రత

బాబ్రీ మసీద్‌ కూల్చివేత కేసులో తీర్పు చెప్పిన లక్నో సీబీఐ ప్రత్యేక జడ్జీకి అదనపు భద్రత కల్పించారు. మసీదు కూల్చివేతలో ఎలాంటి కుట్ర లేదని, నిందితులంతా నిర్ధోషులేనని జడ్జి తన తీర్పులో ప్రకటించారు. ఈ క్రమంలో కేసు తీవ్రత దృష్ట్యా జస్టిస్‌ సురేంద్రకుమార్‌ యాదవ్‌కు కేంద్ర ప్రభుత్వం పారామిలటరీ భద్రతను ఏర్పాటుచేసింది. సంచలన తీర్పు వెలువరించిన రోజే  పదవీ ఆయన విరమణ చేశారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ కేసును విచారిస్తుండటంతో ఆయన పదవీ కాలాన్ని ఇప్పటికే పలుమార్లు పొడిగించారు.

Latest Updates