మహిళా ఎంపీలపై మార్షల్స్ దాడి!

ఆందోళన చేస్తున్న తమ పార్టీ మహిళా ఎంపీలపై మార్షల్స్​ దాడికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్​ లీడర్​ అధిర్ రంజన్​ చౌదరి ఆరోపించారు. పార్లమెంటులో ఇలాంటి ఘటన ఇంతకుముందెప్పుడూ జరగలేదన్నారు. గౌరవనీయులైన సభ్యులపై దాడికి పాల్పడ్డ సెక్యూరిటీ సిబ్బందిపై స్పీకర్, ప్రభుత్వం ఏంచర్యలు తీసుకుంటుందో వేచి చూస్తామన్నారు. ఆ తర్వాత ఏంచేయాలనేదానిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు. అధికార బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. కాంగ్రెస్​ ఎంపీలు తమ ప్రవర్తనతో లోక్​ సభకు తలవంపులు తెచ్చారని, కాంగ్రెస్​ జూనియర్​ ఎంపీలు అభ్యంతరకర రీతిలో ఆందోళన చేస్తుంటే సీనియర్ ఎంపీలు చోద్యం చూస్తున్నారని లా మినిస్టర్​ రవిశంకర్​ ప్రసాద్​మండిపడ్డారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషి, అర్జున్​ రామ్​ మేఘ్వాల్ తదితరులు కూడా కాంగ్రెస్​ ఆరోపణల్ని తప్పుపట్టారు.

Latest Updates