మిస్సెస్ ఇండియా రన్నరప్ గా ఆదిలాబాద్ బ్యూటీ

ముంబైలో జరిగిన మిస్సెస్ ఇండియా పోటీల్లో ఆదిలాబాద్ కు చెందిన వర్షా శర్మ రెండో స్థానంలో నిలిచారు. శనివారం ఆమె నిజామాబాద్ కు వచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న ఆమెను సత్కరించారు. మొత్తం 35 మందితో పోటీపడిన వర్ష, మొదటి రన్నరప్ గా నిలిచారు. వర్ష గెలుపు మొత్తం జిల్లాకు గర్వకారణమన్నారు జోగు రామన్న. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడి జిల్లాకు మరింత ఖ్యాతిని తెస్తానని చెప్పారు వర్షా శర్మ. మహిళలు వంటింటికి పరిమితం కారాదని, ప్రయత్నిస్తే ఏ రంగంలోనైనా రాణించే సత్తా ఉందన్నారు.

Latest Updates