ఆదిపురుష్ లో ప్రభాస్ కు విలన్ గా సైఫ్ అలీ ఖాన్

హైదరాబాద్: రెబల్ స్టార్ ప్రభాస్ నటించనున్న ఆదిపురుష్ సినిమాకు సంబంధించి కొత్త అప్ డేట్ వచ్చింది. 7 వేల ఏళ్ల నాటి రామాయణ ఇతిహాసం ఆధారంగా తీయనున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ కనిపించనున్నాడు. ప్రభాస్ కు విలన్ గా రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ యాక్ట్ చేయనున్నాడు. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం స్పష్టం చేసింది. 7 వేల ఏళ్ల కింద ప్రపంచంలో అత్యంత తెలివైన రాక్షసుడు ఉండేవాడు అంటూ ఈ సినిమాను నిర్మిస్తున్న టీ సిరీస్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. లంకేశ్వరుడు రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించనున్నాడు అంటూ కొత్త పోస్టర్ ను రివీల్ చేసింది. దీంతో ప్రభాస్ కు విలన్ గా ఎవరు నటిస్తారనే ఊహాగానాలకు తెరపడింది.

ప్రభాస్ బాహుబలితో ప్యాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. బాహుబలి తర్వాత సాహోలో ప్రభాస్ నటించాడు. ఈ మూవీ తెలుగునాట పెద్దగా ఆకట్టుకోకపోయినా.. హిందీ ఆడియన్స్ ను మాత్రం అలరించింది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ నటించబోయే సినిమాల విషయంలో డార్లింగ్ పక్కా ప్లానింగ్ తో, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. రాధే శ్యామ్ తో వచ్చే ఏడాది ప్రేక్షకులను పలకరించనున్నప్రభాస్.. ఆ తర్వాత మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో భారీ మూవీకి సన్నాహాలు చేస్తున్నాడు. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో డార్లింగ్ సరసన బాలీవుడ్ హార్ట్ థ్రోబ్ దీపికా పడుకోన్ యాక్ట్ చేయనుండటం విశేషం. ఈ సినిమా తర్వాత ఆదిపురుష్ పట్టాలెక్కనుంది. హిందీలో తానాజీ మూవీతో మంచి పేరు సంపాదించిన ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.

Latest Updates