ఓటీటీలో దుమ్ములేపుతున్న ఆదిపురుష్.. ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్

ఓటీటీలో దుమ్ములేపుతున్న ఆదిపురుష్.. ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) రాముడిగా చేసిన మూవీ ఆదిపురుష్(Adipurush). భారీ అంచనాల మధ్య జూన్ 16న ప్రేక్షకుల ముందుకు  వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి నెగిటీవ్ టాక్ వచ్చింది. రామాయణ గాధ ఆధారంగా వచ్చిన ఈ సినిమాపై అనేక విమర్శలు తలెత్తాయి. రామాయణాన్ని వక్రీకరించారని దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి. దీంతో ఈ సినిమా భారీ ఫ్లాప్ గా నిలిచింది. 

ఇక తాజాగా ఆదిపురుష్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు మేకర్స్. థియేటర్స్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీలో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అమెజాన్ ప్రైమ్(Amazon prime) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఎగబడుతున్నారు. నిజానికి థియేటర్ రిలీజ్ సమయంలో ఈ సినిమాకు నెగిటీవ్ టాక్ రావడంతో ఈ సినిమా చూసేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపించలేదు. దాంతో ఆదిపురుష్ ఓటీటీ రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేశారు. దీంతో ఓటీటీలో రిలీజ్ అయిన వెంటనే.. ఈ సినిమాను చూసేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది ఆదిపురుష్. ఇలా థియేటర్లో ఫ్లాప్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం భారీ హిట్ సాధించింది.     

ఇక ఆదిపురుష్ సినిమా విషయానికి వస్తే.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్(Om raut) తెరకెక్కించిన ఈ సినిమాలో కృతి సనన్(Kriti sanon) సీతగా కనిపించగా.. సైఫ్ ఆలీ ఖాన్(Saif ali khan) రావణుడిగా.. సన్నీ సింగ్(Sunny singh) లక్ష్మణుడి పాత్రలో కనిపించారు. దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్(Bhushan kumar) ఈ సినిమాను నిర్మించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.300 కోట్లు మాత్రమే వసూలు చేసి భారీ ఫ్లాప్ గా నిలిచింది.