శివసేన సీఎం అభ్యర్థిగా ఆదిత్య థాక్రే!

మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన శివసేన ఇప్పుడు ఒంటరిగానే బరిలోకి దిగనుంది. రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాల్లో వచ్చిన బేధాభిప్రాయాలు, సీఎం సీటుపై కూడా పొత్తు కుదరక పోవడంతో విడిగా పోటీ చేయాల్సి వచ్చింది.

ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కూఆ దాదాపుగా ఇవే అంశాలు ముందుకు వస్తున్నాయి. శివసేన అధినేత ఉద్ధవ్‌ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రేనే సీఎం అభ్యర్ధి అంటూ ఆ పార్టీ నేత సంజయ్‌ రౌత్‌ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిస్తున్నాయి. డిప్యూటీ సీఎం పదవిపై ఇప్పటికే బీజేపీ హామీ ఇచ్చిందని, అయితే థాక్రే కుటుంబం అధినేతగా ఉండేందుకు మాత్రమే ఇష్టపడతారని సంజయ్‌ రౌత్‌ అన్నారు.

Latest Updates