దేశంలోనే అతి పెద్ద ఫిల్మ్ సిటీని నోయిడాలో నిర్మిస్తాం

దేశంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీని నిర్మించాలని నిర్ణయించారు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇందుకోసం నోయిడాలో అనువైన స్థలాన్ని చూడాలని అధికారులను ఆదేశించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పలు అభివృద్ధి ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.

గౌతం బుద్ధనగర్‌ జిల్లాలో దేశంలోనే అతిపెద్ద, అందమైన ఫిల్మ్ సిటీని నిర్మించనున్నట్టు చెప్పారు సీఎం యోగి. దీని నిర్మాణం కోసం నోయిడా, గ్రేటర్ నోయిడా, యమునా ఎక్స్‌ప్రే వే సమీపంలో స్థలాన్ని చూడాలని అధికారులను ఆదేశించారు.  అంతేకాదు  మీరట్‌లో చేపట్టిన మెట్రో ప్రాజెక్టును మార్చి 2025లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం యోగి ఆదిత్యనాథ్.

Latest Updates