12గంటల వెయిటింగ్: ఎమ్మెల్యే కూతురికి గవర్నమెంట్ హాస్పిటల్ లో కాన్పు చేయలేదు

మధ్య ప్రదేశ్: తన కూతురిని గవర్నమెంట్ హాస్పిటల్ లో డెలివరీ చేయించడానికి తీసుకెళ్లిన ఓ ట్రైబల్ ఎమ్మెల్యేకు తీవ్ర నిరాశ ఎదురైంది. 12గంటలు వేయిట్ చేసినా గవర్నమెంట్ హస్పిటల్ లో డెలివరీ చేయలేదు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లోని షియోపూర్ జిల్లాలోని విజయ్ పూర్ లో జరిగింది. సీతారాం ఆదివాసి అనే బీజేపీ ఎమ్మెల్యే… నిండు గర్భవతి అయిన తన కూతురు దోడిబాయిని(26)… విజయ్ పూర్ లోని ఓ గవర్నమెంట్ హాస్పిటల్ లో డెలివరీ కోసం సోమవారం (నవంబర్ 18) జాయిన్ చేసి నట్టు తెలిపాడు. అయితే  హాస్పిటల్ లో జాయిన్ చేసి 12గంటలవుతున్నా వైద్యం మొదలు పెట్టలేదని చెప్పారు.

కొంత సేపటికి స్పందించిన హాస్పిటల్ సిబ్బంది.. తన కూతురికి సిజెరియన్ చేయవలసిందిగా చెప్పారని అన్నారు. అయితే అందుకు డాక్టర్ అందుబాటులో లేడని చెప్పినట్టు తెలిపారు… దీంతో వేరే హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే.. ఆంబులెన్స్ కూడా అందుబాటులో లేదని దానికోసం రెండు గంటలు వేయిట్ చేయవలసి వచ్చిందని చెప్పారు. చివరికి వేరే వెహికిల్ లో తన కూతురిని శివపురిలోని ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశానని తెలిపారు…  ప్రైవేట్ హాస్పిటల్ లో సిజెరియన్ చేయకుండానే  నార్మల్ డెలివరీ చేశారని చెప్పారు.  షియోపూర్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ 119 కిమీ ల రూరంలో ఉందని చెప్పారు.

ఈ విషయంపై షియోపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు స్పందించారు. వేరే ఊరిలో మెడికల్ క్యాంపులు ఉండటం వల్లనే తమ దగ్గర తగినంత సిబ్బంది లేదని అన్నారు. అయితే ఆంబులెన్స్ ను తెప్పించినప్పటికీ.. ఎమ్మెల్యే తన కూతురిని తీసుకెళ్లారని అన్నారు.

Latest Updates