ఆదివాసీ సంఘాల పేరుతో మావోయిస్టులపై పోస్టర్లు..

ఆదివాసీ సంఘాల పేరుతో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. భద్రాద్రి కొత్తగూడెం, పెద్ద మిడిసిలేరు.. కలివేరు రోడ్డుపై ఈ పోస్టర్లు ఉన్నాయి. ఇటీవల రాళ్ల పురం గ్రామానికి చెందిన ఉంగి అనే మహిళ పది మందికి విషం ఇచ్చి చంపిందన్న కారణంతో ఆమెను మావోయిస్టులు హతమార్చారు. అయితే ఆ ఆరోపణలకు సరైన ఆదారాలు చూపించాల్సిందిగా మావోయిస్టులను ఆదివాసీలు కోరినా లాభం లేకపోయిందని  తెలిపారు. మావోయిస్టు లీడర్ ఆజాద్ కూడా సరైన వివరణ ఇవ్వలేకపోయాడని చెప్పారు. మావోయిస్టుల కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఎవరైన స్పందిస్తే తట్టకోలేకపోతున్నారని పోస్టర్ లో విమర్శించారు.

ఆదివాసీలు పొట్టకూటికోసం వారంరోజులపాటు సేకరించిన తునికాకును అమ్మగా వచ్చిన మొత్తంలో రెండురోజుల ధనాన్ని మావోయిస్టులు అక్రమంగా తీసుకుని పొట్టకొడుతున్నారని ఆదివాసీ సంఘాలు ఆరోపించాయి. అమాయకులైన ఆదివాసీ ఆడపిల్లలను బలవంతం తమవెంట తిప్పుకోవడం సరైన పద్దతి కాదని పోస్టర్ లో తెలిపాయి ఆదివాసీ సంఘాలు.

Latest Updates