మరో థ్రిల్లర్… అడివి శేష్ ‘ఎవరు’ ట్రైలర్

థ్రిల్లర్ సినిమాలకు మంచి సీజన్ నడుస్తోంది. రీసెంట్ గా రాక్షసుడు విడుదలై సూపర్ హిట్ కొట్టింది. లేటెస్ట్ గా పంద్రాగస్ట్ కు థ్రిల్లర్ తో వస్తున్నాడు అడివి శేష్. క్షణం, గూఢచారి సినిమాల్లో మంచి కంటెంట్ తో ఆకట్టుకున్న అడివిశేష్.. ఈసారి సస్పెన్స్ థ్రిల్లర్ తో అలర్ట్ చేశాడు. టీజర్ తో బజ్ క్రియేట్ చేసిన అడివిశేష్.. ట్రైలర్ తో మరోసారి తన సినిమాను డిస్కషన్ లోకి తీసుకొచ్చాడు.

అడివిశేష్, రెజీనా కాసండ్రా, నవీన్ చంద్ర ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. మూవీని పరమ్ వి పొట్లూరి, పెర్ల్ వి పొట్లూరి, కెవిన్ అన్నే ప్రొడ్యూస్ చేశారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ ను వెంకట్ రామ్ జీ తెరకెక్కించారు.  శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. సాహో రేసు నుంచి తప్పుకోవడంతో.. పంద్రాగస్ట్ కు ముస్తాబైన సినిమాల్లో ఎవరు కూడా ఒకటి.

 

Latest Updates