‘హిట్లర్’ గెలుపు.. నాకు ప్రపంచాన్ని జయించాలనే కోరిక లేదు

వైండ్‌‌హోక్: జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ గురించి వినని వారుండరంటే ఆశ్చర్యం లేదు. అలాంటి హిట్లర్ పేరు మరోమారు వార్తల్లోకి వచ్చింది. హిట్లర్ చనిపోయి చాలా ఏళ్లయ్యింది. అయితే ఆఫ్రికన్ దేశమైన నమీబియా హిట్లర్ అనే పేరుతో ఉన్న ఓ నాయుకుడు గెలవడం వార్తగా మారింది. 54 ఏళ్ల అడాల్ఫ్ హిట్లర్ ఉన్నోనా అనే సదరు నేత రూలింగ్ పార్టీ స్వాపో పార్టీ తరఫున కౌన్సిలర్‌‌గా బరిలోకి దిగారు. ఒంపుడ్జా నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో కౌన్సిలర్‌‌గా గెలుపొందాడు. అయితే అతడి పేరు వింతగా ఉండటంతో వార్తల్లోకి ఎక్కాడు. అయితే హిట్లర్ అనే పదానికి తనకు సరైన అర్థం కూడా తెలియదని హిట్లర్ ఉన్నోనా చెప్పడం గమనార్హం.

‘నా చిన్నతనంలో ఈ పేరును సాధారణంగానే భావించా. ఎదుగుతున్న టైమ్‌లో హిట్లర్ గురించి తెలిసింది. ఆయన ప్రపంచాన్ని తన అధీనంలో ఉంచుకోవాలని, ఏలాలని చూశాడని అర్థమైంది. ఇలాంటి విషయాలతో మాత్రం నాకు ఎలాంటి సంబందం లేదు. నేను గెలిచిన ఒషానా ప్రాంతాన్ని అధీనంలోకి తెచ్చుకునే ఆలోచనలూ లేవు. ప్రజలకు మంచి సేవ చేయాలనుంది అంతే’ అని హిట్లర్ ఉన్నోనా పేర్కొన్నారు. 1884 నుంచి 1915 వరకు నమీబియా జర్మనీ టెర్రిటరీ కిందే ఉండేది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని సౌత్ వెస్ట్ ఆఫ్రికా అని పిలిచేవారు. తొలి వరల్డ్ వార్ తర్వాత ఈ ప్రాంతం సౌతాఫ్రికా అధీనంలోకి వచ్చింది.

Latest Updates