క్విక్​ రెస్పాన్స్ టీంకు రెండు అత్యాధునిక  వాహనాలు

సైబరాబాద్​ ఐటీ కారిడార్​​లో అత్యవసర సమయంలో పరిస్థితులను ఎదుర్కోవడానికి  క్విక్​ రెస్పాన్స్​ బృందానికి  సెక్యూరిటీ ఫర్​ సైబర్​ కౌన్సిల్​ వారు రెండు అత్యాధునిక స్కార్పియో వాహనాలను సైబరాబాద్​ పోలీసులకు అందజేశారు. మంగళవారం సైబరాబాద్​ సీపీ వీసీ. సజ్జనార్​ కమిషనరేట్లో వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఐటీ కారిడార్​లో ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే ఈ క్విక్​ రెస్పాన్స్​ టీం అక్కడకు వెళ్లి సమస్యను పరిష్కరించేలా టెక్నాలజీతో ఈ వాహనాలను ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్​సీఎస్​సీ జనరల్ సెక్రటరీ కృష్ణ యేదుల,  వైస్​ చైర్మన్​ భరణికుమార్​,  సైబరాబాద్ ట్రాఫిక్​ డీసీపీ విజయ్​కుమార్​, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్​రావు, డీసీపీ అనసూయ, ఏసీపీలు, ఇన్​స్పెక్టర్​లు పాల్గొన్నారు.

Latest Updates