రామమందిర నిర్మాణం భూమి పూజకు అద్వానీ, జోషీకి ఆహ్వానం

ఈనెల 5వ తేదీన అయోధ్యలో జరగనున్న రామ మందిరం భూమి పూజ కార్యక్రమానికి బీజేపీ అగ్రనేలు లాల్‌కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్‌ జోషిల కు ఎట్టకేలకు ఆహ్వానం అందింది. కరోనా కారణంగా  వయసు రీత్యా మొదట వీరికి ఆహ్వానం పంపలేదు. వీరిద్దరు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రతిష్టాత్మక వేడుకలో పాల్గొంటారని ప్రచారం జరిగింది. అదే సమయంలో ఉమాభారతి, కల్యాణ్‌సింగ్‌లకు ఆహ్వానాలు అందాయి. దీనిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఆహ్వాన కమిటీ వెంటనే అగ్రనేతలిద్దరిని ఫోన్‌ కాల్‌ ద్వారా వేడుకకు ఆహ్వానించింది. పూజ కార్యక్రమ వేడుకలో మోడీతోపాటు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, న్యాస్‌ చీఫ్‌ నృత్యగోపాల్‌ మాత్రమే వేదికపై కూర్చుంటారని తెలుస్తోంది. మరోవైపు నిఘా వర్గాల హెచ్చరికలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు ఆధికారులు. 3500 నుంచి 4000 మంది కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నారు.

ఆగస్టు 5వ తేదీ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు న్యూయార్క్‌లోని ప్రసిద్ధ టైమ్‌ స్క్వేర్‌లో ఆంగ్లం, హిందీ భాషల్లో జై శ్రీరాం పేరుతో భూమిపూజ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

Latest Updates