హార్పిక్ తాగి ఆత్మహత్యకు యత్నించిన లాయర్

Advocate ramarao suicide attempt
  • జూనియర్ పై లాయర్ లైంగిక వేధింపులు
  • అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసుల్ని చూసి ఆత్మహత్య యత్నం
  • చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి తరలించిన పోలీసులు

పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అని భయపడి ఓ లాయర్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన  హైదరాబాద్‌లోని పద్మారావునగర్‌లో జరిగింది. పద్మారావు నగర్ కు చెందిన అడ్వకేట్ రామరావు తన పై లైగింక వేధింపులకు పాల్పడుతున్నాడని జూనియర్ అడ్వకేట్ షాదన్ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు రామారావును అరెస్టు చేయడానికి చిలకలగూడ పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. పోలీసులను చూసిన రామారావు.. బాత్ రూంలోకి హార్పిక్ తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి తరలించారు

Latest Updates