అమృత విషయంలో చాలా మదన పడ్డాడు: మారుతీ రావు అడ్వకేట్

కూతురి విషయంలో మారుతీరావు చాలా బాధపడ్డాడని ఆయన తరపు లాయర్ v.సుబ్బారెడ్డి అన్నారు. రెండ్రోజుల క్రితం కాల్ చేసి కలుస్తానన్నాడని, సూసైడ్ కంటే ముందు రోజు తానే చివరి సారిగా కాల్ మాట్లాడానని ఆయన అన్నారు.

2018 సెప్టెంబర్ 14 న జరిగిన ప్రణయ్ హత్య కేసులో ఈ నెల 10 వ తారిఖున సాక్షుల విచారణ ఉందని లాయర్ తెలిపారు. ఇదే విషయమై.. కేసు స్టేటస్, చార్జీ షీట్ తో పాటు sc, st సెక్షన్ ను తొలగించాలని రెండు రోజుల్లో పిటిషన్ వేయాల్సి ఉందని చెప్పారు. పిటిషన్ కోసం కావాల్సిన  డాక్యుమెంట్స్ తీసుకొని తన ఆఫీసు కు వచ్చి కలుస్తానని మారుతీరావు చెప్పినట్టు లాయర్ సుబ్బారెడ్డి తెలిపారు. 24 గంటల లోపే ఆయన మరణ వార్త వినాల్సి వచ్చిందని ఆయన అన్నారు.

ప్రణయ్‌ హత్య తరువాత కుమార్తె తన వద్దకు వచ్చేస్తుందని మారుతీరావు భావించారని, మధ్యవర్తులతో రాయబారం పంపినందుకు ఆయన పై మరో కేస్ పెట్టిందన్నారు సుబ్బారెడ్డి. ప్రణయ్ కేసులో కచ్చితంగా శిక్ష పడనుందనే విషయం మారుతీరావు తెలుసునని ఆయన అన్నారు. అయితే ఆస్తి తగాదాల వ్యవహారం ఎప్పుడూ తనతో షేర్ చెయ్యలేదని చెప్పారు.

Latest Updates