బెంగళూరులో ఏరో ఇండియా షో-2019

బెంగళూరులో ఇవాళ ఏరో ఇండియా షో-2019 ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ యలహంకలో  ఏరో ఇండియా షో-2019ను ప్రారంభించారు. అద్భుతమనిపించేలా వైమానిక విన్యాసాలు నిర్వహిస్తున్నారు సైనికులు. బెంగుళూరులో ప్రతి ఏడాది నిర్వహించే ఏరో ఇండియా షో.. ఐదు రోజుల పాటు జరగనుంది. ఈ కార్యక్రమానికి వేలమంది ప్రతినిధులు, ప్రదర్శనకారులు, కార్పొరేట్లు, ప్రభుత్వ ప్రణాళికదారులు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సైనికులు పాల్గొంటారు. ప్రపంచ వ్యాప్తంగా 300 మంది రక్షణ రంగ సంస్థల ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు.

Latest Updates